

రేవంత్ రెడ్డి వివిధ వేదికలపై కుదుర్చుకున్న ఎంవోయూలను వేగంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ వంటి వేదికల్లో కుదిరిన ఒప్పందాల పురోగతిపై దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి సమీక్ష నిర్వహించారు. కంపెనీలను మూడు కేటగిరీలుగా విభజించి, మల్టీనేషనల్ కంపెనీలకు ప్రాధాన్యం ఇచ్చి వేగంగా పనులు ప్రారంభించేలా చూడాలని సూచించారు. క్యూర్, ఫ్యూచర్, రేర్ ప్రాంతాల్లో భూములు కేటాయించాలని, ఫ్యూచర్ సిటీ కార్యాలయం త్వరగా పూర్తి చేసి డ్యాష్‌బోర్డ్ ద్వారా అమలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అలాగే టైర్ 2, టైర్ 3 నగరాల్లోని ఐటీ టవర్ల వినియోగంపై దృష్టి పెట్టాలని చెప్పారు.
అలాగే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మెట్రో పనులకు సంబంధించి భూసేకరణ వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. చాంద్రాయణగుట్ట వరకు మెట్రో పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టారు. రెండో దశ మెట్రో అనుమతులు, బహదూర్‌పురా వరకు విస్తరణ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో రామకృష్ణారావు, శశాంక్, భవేష్ మిశ్రా, అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!