

అల్లు అర్జున్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకా’ చిత్రంపై వస్తున్న రూమర్స్‌ను చిత్రబృందం ఖండించింది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె రెండోసారి తల్లి కానున్నట్లు ప్రకటించిన తర్వాత షూటింగ్ ఆలస్యం అవుతుందనీ, ఆమె స్థానంలో మరో నటిని తీసుకుంటారనే వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ అసత్యమని చిత్రబృందం స్పష్టం చేసింది. సినిమాలో దీపిక పాత్ర ఎంతో కీలకమని, షూటింగ్ కూడా ప్రణాళిక ప్రకారమే కొనసాగుతోందని తెలిపింది. రూమర్స్‌ను నమ్మవద్దని అభిమానులను కోరింది.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో దీపిక యాక్షన్ సన్నివేశాల్లోనూ నటిస్తున్నట్లు సమాచారం. అవసరమైన జాగ్రత్తలతో ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో లుక్ కోసం అల్లు అర్జున్ రోజుకు 3 నుంచి 4 గంటలు కృషి చేస్తున్నారని సినీ వర్గాలు వెల్లడించాయి.













.webp&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!