
సినిమాలు

ఖమ్మం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బోనగిరి నాగేశ్వరరావు తన కుమార్తె పెళ్లి శుభలేఖను సైబర్ నేరాలపై అవగాహన కల్పించే వేదికగా మార్చారు. సమాజానికి తన బాధ్యతను చాటుతూ, శుభలేఖలో ప్రత్యేకంగా “సైబర్ మోసాలపై అవగాహనే మీకు రక్ష” అనే శీర్షికతో ఓ పేజీ రూపొందించారు.
ఈ అవగాహనలో “చిన్న లింక్ పెద్ద నష్టం చేస్తుంది,” “ఉచిత గిఫ్టుల మోసాలకు జాగ్రత్త,” “ఫోన్ లేదా పార్సిల్ కాల్స్‌ను నమ్మవద్దు,” “మీ బ్యాంక్ అకౌంట్‌ను తరచుగా పరిశీలించండి,” “పబ్లిక్ వైఫై ఉపయోగంలో జాగ్రత్త” వంటి సూచనలు ఉన్నాయి. ఈ వినూత్న ప్రయత్నం ద్వారా సైబర్ నేరాల నుంచి ప్రజలను రక్షించవచ్చని ఆయన సందేశం ఇచ్చారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!