
సినిమాలు

విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక లైక్‌తో జర్మనీ మోడల్ లిజ్‌లాజ్ ఒక్కరోజులో పాపులర్ అయింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోహ్లీపై నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. దీనిపై స్పందించిన లిజ్‌లాజ్, మొదట కోహ్లీ తన ఫొటోను లైక్ చేయడంతో చాలా సంతోషించానని, తర్వాత ఆయన అన్‌లైక్ చేయడంతో పాటు ట్రోల్స్ రావడం బాధగా అనిపించిందని చెప్పింది.
ఈ లైక్ వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని, నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారని లిజ్‌లాజ్ వివరించింది. అయినప్పటికీ స్టార్ క్రికెటర్ తన ఫొటోను లైక్ చేయడం గర్వంగా అనిపించిందని తెలిపింది. ఆమెకు ఐపీఎల్ అంటే ఇష్టం ఉండడంతో పాటు ఆర్సీబీ జట్టుకు అభిమానిగా ఉందని చెప్పింది. ఇటీవల ఆర్సీబీ జెర్సీ ధరించి వీడియో పోస్ట్ చేయడంతో అభిమానులు స్పందించగా, తాను జర్మనీలో ఉన్నానని, అవకాశం దొరికితే స్టేడియంలో మ్యాచ్ చూడాలని ఉందని తెలిపింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!