

తిరుపతి జిల్లాలోని నారాయణవనం మండలంలో ఒకే రోజులో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. వెంకటకృష్ణపాలెం గ్రామానికి చెందిన మోహన్ తన భార్య హరిత (33), తల్లి చంద్రకళ (65)లను ఇంట్లోనే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మోహన్‌కు ఇద్దరు పిల్లలు కౌశిక్ (14), హరిణి (12) ఉన్నారు. వారు పుత్తూరులోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. మోహన్ సిమెంట్ దుకాణం నడిపితే, హరిత టైలరింగ్ షాప్ నిర్వహిస్తోంది. హరిత సోదరుడు బాలకృష్ణ ఇంటికి వచ్చి చూడగా ఇద్దరూ మృతదేహాలుగా కనిపించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. మోహన్ చున్నీతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆ తర్వాత మోహన్ తన పిల్లలను పాఠశాల నుంచి తీసుకువచ్చి, పలు ప్రాంతాల్లో తిరిగిన అనంతరం వేపగుంట రైల్వే స్టేషన్ సమీపంలో ఆగాడు. అక్కడ రైల్వే పట్టాలపై తల పెట్టడంతో పిల్లలు భయంతో ఆపేందుకు ప్రయత్నించారు. అయితే వేగంగా వచ్చిన రైలు ముగ్గురినీ ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. కుటుంబంలో ఆర్థిక లేదా వ్యక్తిగత సమస్యలు లేవని తెలిసినా, ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణం ఇంకా మిస్టరీగానే ఉంది. రెండు హత్యలపై స్థానిక పోలీసులు, మిగిలిన ముగ్గురు మరణాలపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













.webp&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!