

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బియ్యం ఎగుమతులపై ముసాయిదా విధానాన్ని రూపొందించింది. సమరేందు మహంతి, వీసీ అల్దాస్ జనయ్యల నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం జాతీయ, అంతర్జాతీయ విధానాలను అధ్యయనం చేసి “తెలంగాణ బియ్యం మిగులు నిల్వల నిర్వహణ – ఎగుమతుల ఆదాయం, సుస్థిరత, పంటల వైవిధ్యీకరణ” పేరుతో నివేదికను సమర్పించింది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అంతర్జాతీయ బియ్యం హబ్‌గా అభివృద్ధి చేయాలని, ఎగుమతులను ప్రోత్సహించాలని నివేదిక సూచించింది. 2013–14లో 65.81 లక్షల టన్నులుగా ఉన్న వరి దిగుబడి 2024–25 నాటికి 1.70 కోట్ల టన్నులకు పెరిగింది. సాగు విస్తీర్ణం కూడా 19.95 లక్షల హెక్టార్ల నుంచి 46.9 లక్షల హెక్టార్లకు పెరిగింది.
మిగులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు మార్కెట్ ధరలకు నేరుగా విక్రయించడం ద్వారా నిల్వ ఖర్చులను తగ్గించవచ్చని, లేకపోతే ఛత్తీస్‌గఢ్ తరహాలో వేలం విధానాన్ని అమలు చేయాలని సూచించారు. మార్కెట్ ధరలు ఎంఎస్‌పీ కంటే తక్కువగా ఉంటే తేడాను నగదు బదిలీ ద్వారా రైతులకు అందించవచ్చు. ఎగుమతుల పెంపుదల కోసం 5 లక్షల హెక్టార్లలో అధిక నాణ్యత వరి ఉత్పత్తి క్లస్టర్లను ఏర్పాటు చేయాలని, ఆధునిక సాగు పద్ధతులు, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో రైస్ మిల్లులను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. అలాగే ఉద్యాన పంటలు, నూనె గింజలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల వైపు రైతులను మళ్లించేందుకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, విస్తరణ సేవలను అందించాలని సూచించారు.













.webp&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!