
రాజకీయాలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్‌పై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుతంగా రాణించింది. అయితే మ్యాచ్ సమయంలో జరిగిన ఒక విచిత్ర ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.
చెన్నై ఇన్నింగ్స్ సమయంలో శివం దూబే క్రీజులో ఉన్నప్పుడు గ్యాలరీలో ఉన్న ఓ అభిమాని నిమ్మకాయ పట్టుకుని మంత్రాలు చదువుతున్నట్లు కనిపించాడు. అతడు అలా చేసిన కొద్దిసేపటికే సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో శివం దూబే ఔటయ్యాడు. వెంటనే ఆ అభిమాని సంబరాలు చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ, నెటిజన్ల నుంచి విభిన్న స్పందనలు వస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!