
రాజకీయాలు

కోర్ట్ సినిమా విజయంతో రోషన్, శ్రీదేవి జంట మంచి గుర్తింపు సంపాదించింది. వీరిద్దరూ కలిసి నటించిన బ్యాండు మేళం అనే టీనేజ్ ప్రేమకథా చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన విజయం సాధించలేదు.
ఇప్పుడు ఈ సినిమాను ఈ నెల 24వ తేదీ నుంచి జీ5 వేదికలో ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గిరి అనే యువకుడు చదువులో అంతగా ఆసక్తి చూపకపోయినా సంగీతంపై మక్కువ కలిగి ఉంటాడు. తన సొంత బృందంతో ఊరిలో జరిగే వేడుకల్లో పాటలు పాడుతూ ఒక రోజు పెద్ద సంగీత దర్శకుడు కావాలని కలలు కంటాడు.
ఇక అతని మరదలు రాజి చదువులో ముందుంటుంది. గిరికి ఆమెపై ఎంతో ప్రేమ ఉంటుంది. అయితే ఆమె తన కళాశాల స్నేహితుడితో వెళ్లిపోతుంది. తర్వాత మోసపోయి తిరిగి వస్తుంది. అప్పుడు గిరి ఆమెను అంగీకరిస్తాడా లేదా అనేదే కథలో ప్రధాన అంశం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!