

రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా రెండో విడత నిధుల విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 20వ తేదీన (ఎల్లుండి) రెండో విడత నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 1.50 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందనుంది. ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అదే రోజున భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సమక్షంలో ఈ నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించనున్నారు.
తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉండగా, మొదటి విడతలో గత నెల 23న సాయం అందింది. అప్పట్లో ప్రతి ఎకరాకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. దాదాపు రూ.3,590 కోట్లు అప్పట్లో విడుదలయ్యాయి. ఇక రెండో విడతలో 45,11,947 మంది రైతులు లబ్ధి పొందనుండగా, మొత్తం రూ.5,653 కోట్లు జమ కానున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. రెండో విడత అనంతరం మూడో విడత నిధులను కూడా త్వరితగతిన విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!