

జనన ధ్రువీకరణ పత్రాల జారీ కోసం లంచం డిమాండ్ చేసిన నారాయణపేట ఆర్డీవో రామచందర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, ఐదుగురు వ్యక్తులు గత ఏడాది జులైలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దారు నుంచి ఆర్డీవో కార్యాలయానికి పంపిన ఈ దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండడంతో బాధితులు పలుమార్లు కార్యాలయానికి వెళ్లినా ఫలితం లేకపోయింది.
చివరకు ఆర్డీవో ఒక్కో ధ్రువీకరణ పత్రానికి రూ.7,500 డిమాండ్ చేసి, తరువాత రూ.5,000 చొప్పున మొత్తం రూ.25,000 ఇవ్వాలని ఒప్పుకున్నాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు ఉచ్చు వేసి మంగళవారం లంచం తీసుకుంటుండగా అతడిని పట్టుకున్నారు. అనంతరం కార్యాలయం, ఇంట్లో సోదాలు నిర్వహించగా నగదు, లక్షల రూపాయల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!