

నటుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాయపడిన సింహం’ సినిమా ప్రమోషన్స్ చాలా వెరైటీగా జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఒక సాధారణ యువకుడి జీవితాన్ని ఎలా మార్చేస్తుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో చేసిన ఫన్నీ ఏఐ వీడియోను విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వీడియోలో తరుణ్ భాస్కర్ ట్రంప్‌కు టీ ఇస్తూ అది ఇండియన్ టీ కాదు, ఇరానీ టీ అని చెప్పడం, దానికి ట్రంప్ సరదాగా స్పందిస్తూ ఇరాన్లో సినిమా రిలీజ్ చేయొద్దని చెప్పడం ప్రేక్షకులను నవ్విస్తోంది.
ఈ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. వినూత్నమైన కథతో రూపొందిన ఈ ఎంటర్టైనర్ వచ్చేనెల 1 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఓవర్సీస్లో మాత్రం ఈ నెల 30 న ప్రీమియర్స్ పడనున్నాయి. ప్రమోషన్స్‌లో ఏఐ టెక్నాలజీని వాడుతూ ట్రంప్ లాంటి వ్యక్తిని కామెడీగా చూపించడం వల్ల సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.


















.jpg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!