
సినిమాలు

మార్కాపురం జిల్లాలో రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మరియు టిప్పర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న కనీసం 10 మంది సజీవదహనమయ్యారు. మరికొందరు గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
ప్రమాదం తీవ్రతకు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

.webp&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!