

శ్రీరామ నవమి పండుగ సందర్భంగా, ప్రజలు ప్రసాదాలకంటే ప్రత్యేక పానకం తాగడం ఇష్టపడతారు. ఈ పానకం అనారోగ్య సమస్యలను తగ్గించి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది.
కావలసిన పదార్ధాలు:
1.రెండు టేబుల్ స్పూన్స్ మిరియాలు
2.ఒక కప్పు తురుమిన బెల్లం
3.ఐదు గ్లాసుల నీళ్లు
4.ఒక టీ స్పూన్ యాలకుల పొడి
తయారీ విధానం:
పానకం తయారు చేయడానికి ముందుగా బెల్లాన్ని తురుమి గిన్నెలో పెట్టాలి. మిరియాలను బాగా నరిచి, పెద్ద పాత్రలో సగం వరకు నీళ్లు వేసి, అందులో బెల్లం, మిరియాలు, యాలకుల పొడిని కలిపి మిక్స్ చేయాలి, కొందరు శొంఠి పొడిని కూడా వేసుకుంటారు. ఈ పానకం తాగితే శరీరంలోని వేడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది రుచికరం మాత్రమే కాక, ఆరోగ్యానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది.
గమనిక : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహా, నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!