

వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చాలా మంది మహిళలు బయటకు వెళ్లేటప్పుడు ముఖాన్ని దుపట్టాతో కప్పుకుంటారు. ఇది కేవలం అలవాటు మాత్రమే కాకుండా చర్మాన్ని రక్షించే ఒక మార్గం కూడా. చర్మవ్యాధి నిపుణుల ప్రకారం, దుపట్టా సూర్యుని అల్ట్రావయలెట్ కిరణాలు, దుమ్ము, కాలుష్యం నుంచి కొంతవరకు రక్షణ ఇస్తుంది. ముఖ్యంగా మందపాటి కాటన్ లేదా నార వస్త్రాలు, అలాగే ముదురు రంగు దుస్తులు అల్ట్రావయలెట్ కిరణాలు అడ్డుకోవడంలో మెరుగ్గా పనిచేస్తాయి.
అయితే దుపట్టా మాత్రమే పూర్తి రక్షణ ఇవ్వదని డాక్టర్లు చెబుతున్నారు. డాక్టర్ల సూచనలు: బయటకు వెళ్లే ముందు కనీసం SPF 30 ఉన్న సన్‌స్క్రీన్ వాడాలి, ప్రతి 2–3 గంటలకు మళ్లీ రాయాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఎండలోకి వెళ్లడం తగ్గించాలి. టోపీ, గాగుల్స్, గొడుగు వంటి రక్షణ సాధనాలు కూడా ఉపయోగించాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే చర్మాన్ని ఎండదెబ్బ, నల్లమచ్చలు, అకాల వృద్ధాప్యం నుంచి సురక్షితంగా కాపాడుకోవచ్చు.
గమనిక : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహా, నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!