

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఉగాది సందర్భంగా ఈ నెల 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్ రాకపోయినా, పాజిటివ్ రివ్యూలతో బాక్సాఫీస్ వద్ద మంచి ప్రారంభం సాధించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్టైల్, కామెడీ టైమింగ్, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో శ్రీలీల మరియు రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించగా, కథలో శ్రీలీల పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం లభించింది. ‘లీల’ అనే రేడియో జాకీ పాత్రలో ఆమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథ ఆమె చుట్టూ తిరగడం, పవన్ - శ్రీలీల మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘ఈ మనసే’ పాట రీమిక్స్ కూడా ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చింది.
అయితే మొదటగా ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకోవాలని దర్శకుడు భావించారట. గతంలో వారి కాంబినేషన్ సక్సెస్ కావడంతో మళ్లీ కలిసి పని చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, పూజా హెగ్డే ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌ను చేయలేకపోయిందని సమాచారం. దీంతో ఆ అవకాశం శ్రీలీలకు దక్కింది. ఆమె తన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాకు కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. ఈ సినిమా ఆమె కెరీర్‌కు మంచి మలుపు తీసుకురావచ్చని, ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!