
న్యూస్

ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సొంతంగా ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌తో పాటు అమెజాన్ సేవలన్నింటితో అనుసంధానం అయ్యేలా ఈ ఫోన్‌ను రూపొందించే యోచనలో ఉంది. సంప్రదాయ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే పనిచేస్తూనే అదనంగా ఏఐ సేవలను అందించే విధంగా దీన్ని రూపొందించనున్నట్లు సమాచారం.
ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా అమెజాన్ యాప్‌లో షాపింగ్, ప్రైమ్ వీడియోలో సినిమాలు వీక్షించడం, అమెజాన్ మ్యూజిక్ వినడం, ఆహార డెలివరీ సేవలు సులభంగా పొందేలా ఫీచర్లను అందించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఫోన్ ధర, విడుదల తేదీ వంటి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ప్రాజెక్టు పూర్తిగా అమలు కాకపోతే దాన్ని నిలిపివేసే అవకాశమూ ఉందని సమాచారం.




















.webp&w=3840&q=75)
.avif&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!