
గాసిప్స్

ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. అరుణ్ రంగరాజులు నిర్మాణంలో రామ్ చక్రి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వచ్చే నెల 3 న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ భావోద్వేగాలు, మధ్యతరగతి జీవిత సమస్యలతో కూడిన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఈ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ జీవితం గురించి భిన్నంగా ఆలోచింపజేసే కథతో ఈ సినిమా రూపొందిందన్నారు. ఈ చిత్రం చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ అప్పుల భారాన్ని తగ్గించుకోవాలనే ఆలోచన కలుగుతుందని తెలిపారు. మధ్యతరగతి కుటుంబాలకు దగ్గరగా ఉండే ఈ కథ ప్రేక్షకుల మనసులను తాకుతుందని చిత్రబృందం తెలిపింది.

.avif&w=3840&q=75)




.jpg&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!