
సినిమాలు

రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం మారిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత క్రికెటర్ షేన్ వార్న్ కుటుంబానికి సుమారు రూ.450 కోట్లు లభించనున్నట్లు సమాచారం.
RR అమ్మకం.. షేన్‌వార్న్ ఫ్యామిలీకి 450 కోట్లుఐపీఎల్ ప్రారంభ దశలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షేన్ వార్న్ కెప్టెన్‌గా వ్యవహరించారు. జట్టు క్రికెట్ కార్యకలాపాలపై కూడా ఆయనకు ముఖ్య బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఈ క్రమంలో ప్రతీ ఏడాది ఆయనకు 0.75 శాతం యాజమాన్య వాటాను కేటాయించారు.
వార్న్ మొత్తం నాలుగు సీజన్లలో జట్టుకు సేవలందించగా, ఈ వ్యవధిలో ఆయనకు కలిపి 3 శాతం వాటా లభించింది. తాజా యాజమాన్య మార్పుల నేపథ్యంలో ఈ వాటా విలువ సుమారు రూ.450 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.

















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!