
న్యూస్
.webp&w=3840&q=75)
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో డ్రగ్స్ సరఫరా చేసిన ప్రధాన నిందితుడు అభిషేక్ సింగ్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో కేసు దర్యాప్తు కొత్త మలుపు తీసుకుంది. పైలెట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్‌కు కూడా అభిషేక్ సింగ్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ కేసులో మరిన్ని వ్యక్తుల ప్రమేయంపై సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
అభిషేక్ సింగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన వారెవరో గుర్తించేందుకు సిట్ అధికారులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సెల్ ఫోన్ డేటా, కాల్ రికార్డులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా వెలికితీయాలని సిట్ అధికారులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నారు.















.webp&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!