

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రం గత ఏడాది జూన్ 20 న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. ఈ మూవీలో నటి జెనీలియా దేశ్‌ముఖ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా, అమీర్ ఖాన్ మరియు అపర్ణ పురోహిత్ నిర్మాతలుగా వ్యవహరించారు.
థియేటర్లలో విడుదలైన దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఈ సినిమా ఇప్పుడు ఓటీటీకి వస్తోంది. మేకర్స్ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ చిత్రం వచ్చే నెల 3 నుంచి సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. గతంలో ఆమిర్ ఖాన్ ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనని ప్రకటించారు. తర్వాత యూట్యూబ్‌లో రెంట్ విధానంలో అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఒక దశలో ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ సుమారు రూ.120 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ పెద్ద డీల్‌ను అమీర్ ఖాన్ తిరస్కరించి, సినిమా కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుందని చెప్పారు. తరువాత తన నిర్ణయాన్ని మార్చుకుని ఇప్పుడు ఓటీటీలో విడుదల చేయడానికి అంగీకరించారు. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్ జైన్, నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!