

దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. భారత్లో వచ్చే 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, వ్యూహాత్మక నిల్వలతో కలిపి 74 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని పేర్కొంది. పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న క్యూలను దృష్టిలో ఉంచుకుని, ఇంధన కొరతపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పుడు మరియు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని కేంద్రం వెల్లడించింది.
భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రిఫైనర్‌గా, ఐదో అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిదారుగా నిలిచిందని అధికారులు తెలిపారు. దేశంలోని అన్ని రిఫైనరీలు 100% సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, 150కి పైగా దేశాలకు ఇంధనాన్ని సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. ఎల్‌పీజీ నిల్వలు కూడా తగినంతగా ఉన్నాయని, దేశీయ ఉత్పత్తి పెరగడంతో దిగుమతులపై ఆధారపడటం తగ్గిందని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.






.webp&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!