

తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు, పొడి వాతావరణం మరియు భారీ ఎండలు కొనసాగనున్నాయి. ఈ రోజు నుండి ఈ నెల 30 వరకు ఉత్తర మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో దక్షిణ మరియు తూర్పు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. ముఖ్యంగా రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో కూడా వర్షం పడే సూచనలు ఉన్నాయి. రాబోయే పది రోజుల పాటు వాతావరణం అస్థిరంగా ఉండనుందని నిపుణులు చెబుతున్నారు.
ఒకవైపు మండే ఎండలు, మరోవైపు అకస్మాత్తుగా వచ్చే ఉరుములతో కూడిన వర్షాలు ప్రజలకు ఇబ్బందులు కలిగించనున్నాయి. వచ్చే నెల నెల ప్రారంభంలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వచ్చే నెల 1 నుంచి 3 వరకు దక్షిణ మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాలులు బలంగా వీస్తాయి. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధానంగా పొడి వాతావరణం కొనసాగుతుంది.
వచ్చే నెల 4 నుండి 8 మధ్య మరోసారి వాతావరణంలో మార్పు చోటు చేసుకుంటుంది. హైదరాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వడగాలుల తీవ్రత కొంత తగ్గినా, ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల మధ్యే కొనసాగుతాయి. ఈ మార్పుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వర్షాలు మరియు ఈదురుగాలుల సమయంలో సురక్షిత ప్రదేశాల్లో ఉండాలి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!