

కోల్‌కతా బ్యాటర్ రఘువంశీని ‘అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’ కింద ఔట్‌గా ప్రకటించడం వివాదానికి దారితీసింది. ఈ ఘటన ఇన్నింగ్స్ అయిదో ఓవర్లో చోటుచేసుకుంది. ప్రిన్స్ యాదవ్ వేసిన బంతిని మిడాన్ దిశగా ఆడిన రఘువంశీ సింగిల్ కోసం పరుగెత్తడం ప్రారంభించాడు. అయితే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న గ్రీన్ స్పందించకపోవడంతో పరుగు తిరస్కరించబడింది. దీంతో రఘువంశీ తిరిగి క్రీజులోకి చేరేందుకు ప్రయత్నించాడు.
పరుగులో భాగంగా రఘువంశీ తన దిశ మార్చుకుని పిచ్ మధ్య నుంచి ఎడమ వైపుగా కదిలాడు. ఇదే సమయంలో ఫీల్డర్ విసిరిన బంతి అతని కాళ్లకు తగిలింది. దీంతో షమి, లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ అప్పీల్ చేశారు. బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించి బంతి వికెట్‌కీపర్‌కు చేరకుండా అడ్డుకున్నాడని భావించిన మూడో అంపైర్ అతడిని ఔట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంతో కోల్‌కతా ఆటగాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. కోచ్ అభిషేక్ నాయర్ మ్యాచ్ అధికారులతో వాదనకు దిగగా, రఘువంశీ కూడా మైదాన అంపైర్లతో అసంతృప్తి వ్యక్తం చేశాడు. పెవిలియన్‌కు వెళ్తూ ఆగ్రహంతో హెల్మెట్, బ్యాట్‌ను విసిరేశాడు. యూసుఫ్ పఠాన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా తర్వాత ఐపీఎల్ చరిత్రలో ‘అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’ కింద ఔటైన నాలుగో బ్యాటర్‌గా రఘువంశీ నిలిచాడు.






.png&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!