

దేశీయ బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం మంచి వృద్ధి దిశగా కొనసాగుతోందని తాజా సర్వే వెల్లడించింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, ఈ ఏడాది జూన్ వరకు బ్యాంకింగ్ రంగానికి ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని ఫిక్కీ–ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సంయుక్తంగా నిర్వహించిన సర్వే తెలిపింది. ఈ కాలంలో భారతీయ బ్యాంకుల పారిశ్రామిక రుణ వితరణ 11 నుంచి 13 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఈ సర్వేను జనవరి–ఫిబ్రవరి మధ్య కాలంలో దేశంలోని 24 ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ, స్మాల్ ఫైనాన్స్ మరియు సహకార బ్యాంకుల ప్రధాన అధికారులతో చర్చించి రూపొందించారు. రిటైల్ మరియు ఎస్ఎంఈ రంగాల నుంచి రుణాలకు పెరుగుతున్న డిమాండ్, మౌలిక వసతులు, ఆటో, ఆటోమొబైల్ విడిభాగాలు, ఫార్మా, రియల్టీ, తయారీ, డేటా కేంద్రాలు, రక్షణ రంగాల కంపెనీల నుంచి టర్మ్ రుణాలపై పెరుగుతున్న ఆసక్తి ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ పెట్టుబడులు మరియు వ్యయాలు పెరగడం కూడా బ్యాంకింగ్ రంగానికి అనుకూలంగా నిలుస్తుందని సర్వే తెలిపింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!