

మల్లారెడ్డి తన ప్రత్యేక శైలి మాటలతో ఎప్పుడూ ప్రజలను అలరిస్తుంటారు. తాజాగా ఒక వినోద కార్యక్రమంలో పాల్గొని తన సరదా మాటలతో అందరిని నవ్వించారు. సాధారణంగా రాజకీయ సభలు లేదా కళాశాల కార్యక్రమాల్లో కనిపించే ఆయన ఈసారి వినోద కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేకంగా మారింది. తొలిసారి ఓ ఎంటర్‌టైన్‌మెంట్ షోకి గెస్ట్‌గా వెళ్లాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్ షో ‘సర్కార్ షో’ ఆరో సీజన్‌లో పాల్గొన్నాడు. కార్యక్రమంలో ఆయన చేసిన నృత్యాలు, వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇటీవల విడుదలైన ప్రచార భాగంలో సుధీర్‌పై మల్లారెడ్డి చేసిన సరదా వ్యాఖ్యలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. పెళ్లి చేసుకుంటే సమస్యలు ఉంటాయా అని సుధీర్ అడగగా పనికిరాని వారికి మాత్రమే సమస్యలు ఉంటాయని సమాధానం ఇచ్చారు. ఇంకా ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోలేదా అంటూ సుధీర్‌ను సరదాగా ప్రశ్నించడంతో అక్కడ ఉన్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
ఇక ఉచితంగా సీట్లు ఇస్తానని వచ్చిన మాటపై కూడా మల్లారెడ్డి సరదాగా స్పందించారు. ఉచితాల కోసం పిల్లలు కనడం ఎందుకని చమత్కరించారు. తన జీవిత కథలో ఎవరు నటించాలి అన్న ప్రశ్నకు దర్శకుడు ఎవరిని ఎంపిక చేస్తే వారు నటిస్తారని చెప్పారు. పూర్తి కార్యక్రమం మే ఒకటవ తేదీన విడుదల కానుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!