
న్యూస్

హైదరాబాద్ నగరంలో త్వరలో ఒక కొత్త కామన్ మొబిలిటీ యాప్ అందుబాటులోకి రానుంది. ఈ యాప్ ద్వారా బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్, ఓలా, ఊబర్ వంటి రవాణా సౌకర్యాలను ఒకే టికెట్‌తో ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్‌ను ఉమ్టా సంస్థ రూపొందిస్తోంది. దీనికి సంబంధించి కన్సల్టెంట్‌ను ఎంపిక చేసేందుకు టెండర్లు కూడా పిలిచారు.
ఈ యాప్‌లో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో నమోదు చేస్తే, ఎలా వెళ్లాలో వివరంగా చూపిస్తుంది. యాప్‌లోనే టికెట్ బుక్ చేసి చెల్లిస్తే క్యూ ఆర్ కోడ్ వస్తుంది. అదే కోడ్‌తో బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్‌లో ప్రయాణించవచ్చు. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత కూడా ఓలా, ఊబర్‌ను విడిగా బుక్ చేయకుండా అదే టికెట్‌తో ప్రయాణం కొనసాగించవచ్చు. అలాగే ‘మీ టికెట్’ యాప్ సేవలను కూడా ఇందులో కలపనున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!