
రాజకీయాలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు శుభవార్త అందింది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్ తిరిగి జట్టులో చేరుతున్నట్లు ప్రకటించాడు. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆయన మళ్లీ మైదానంలోకి దిగనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
సీజన్ ప్రారంభానికి ముందు వెన్ను నొప్పి కారణంగా కమిన్స్ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇషాన్ కిషన్ తాత్కాలిక కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన కమిన్స్ తిరిగి జట్టులో చేరుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా సోషల్ మీడియా ద్వారా ఆయన రాకను ధ్రువీకరించింది.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!