

వచ్చే ఐదేళ్లలో గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ తన వ్యాపారాన్ని గణనీయంగా విస్తరించనుంది. ఇందులో భాగంగా క్యాపిటల్ మరియు కెమికల్ రంగాల్లోని అనుబంధ కంపెనీలను స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ చేయాలని యోచిస్తోంది. ఈ వ్యూహంతో గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.5 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని త్వరలో గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న ఫిరోజ్‌షా గోద్రెజ్ తెలిపారు.
కొత్తగా లిస్టింగ్ అయ్యే కంపెనీల వ్యాపార విస్తరణ కోసం వచ్చే ఐదేళ్లలో రూ.5,000 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రూప్ నైతిక వ్యాపార విలువలకు కట్టుబడి, లిస్టింగ్ అయ్యే సంస్థలను లాభదాయకంగా నడపాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఫిరోజ్‌షా గోద్రెజ్ గ్రూప్ కొత్త బ్రాండ్ ఐడెంటిటీని కూడా ఆవిష్కరించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!