
న్యూస్

భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే దేశ ప్రజలు శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలని కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడలశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. నిన్న దాల్ సరస్సు తీరంలో నిర్వహించిన ‘సండే ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించే ముఖ్యమైన సందేశమని అన్నారు. పౌరులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బలంగా మారుతుందని, బలమైన సమాజమే దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతుందని చెప్పారు.
దేశవ్యాప్తంగా దేహ దారుఢ్యాన్ని ప్రోత్సహించేందుకు 16 వేల ప్రాంతాల్లో ‘సండే ఆన్ సైకిల్’ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇకపై శ్రీనగర్ యువత ప్రతి ఆదివారం సైకిళ్లు తొక్కుతూ ‘ఫిట్ ఇండియా’ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారని వెల్లడించారు.

.jpg&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!