

భారత్ మరియు రష్యా మధ్య కుదిరిన సైనిక సహకార ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారం మరింత బలోపేతం కానుంది. ఈ ఒప్పందం ప్రకారం, రెండు దేశాలు ఒకరి భూభాగంలో మరొకరు గరిష్టంగా 3,000 మంది సైనిక సిబ్బందిని నిలిపి స్థావరాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే యుద్ధ నౌకలు, సైనిక విమానాలను పరస్పరం వినియోగించుకోవచ్చు.
ఇక ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, మానవీయ సహాయం వంటి అంశాల్లో కూడా ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు ముందు కుదిరిన ఈ లాజిస్టిక్స్ మార్పిడి ఒప్పందం (RELOS) ద్వారా రక్షణ రంగంలో అనుసంధానం మరింత పెరుగుతుంది. ఈ ఒప్పందం కింద, రెండు దేశాల యుద్ధ నౌకలు మరియు విమానాలు పరస్పర గగనతలం, నౌకాశ్రయాలను ఉపయోగించుకోవడానికి అనుమతి ఉంటుంది. దీంతో భద్రతా సహకారం, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!