
సినిమాలు

కీలక పార్లమెంట్ ఓటింగ్‌కు ముందు ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అనూహ్యంగా భేటీలు, చర్చలు జరుగుతుండగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన కార్యాలయంలో సీనియర్ మంత్రులతో మంతనాలు జరిపారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, కే.సి. వేణుగోపాల్ లోక్‌సభ స్పీకర్‌ను కలుసుకున్నారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఓటింగ్‌కు మద్దతివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగింది. లోక్‌సభలో రాహుల్ గాంధీ త్వరలో ప్రసంగించనుండగా, విపక్ష ఇండి కూటమి ఇప్పటికే అంతర్గత చర్చలు నిర్వహిస్తోంది. డీలిమిటేషన్ బిల్లును ఓడిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించగా, చిన్న పార్టీలను కూడా తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!