
న్యూస్

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీ సీ ఎస్) నాసిక్‌లో జరిగిన లైంగిక వేధింపుల కేసుపై విచారణ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఘటనపై సమగ్రంగా, పారదర్శకంగా దర్యాప్తు జరిపేందుకు సంస్థ స్వతంత్ర పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగుల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులతో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉద్యోగుల ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటికే మొత్తం 9 కేసులు నమోదైనట్లు టీ సీ ఎస్ వెల్లడించింది. ప్రధాన నిందితురాలు నిదాఖాన్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిదాఖాన్ హెచ్ ఆర్ మేనేజర్ కాదని, కేవలం ప్రాసెస్ అసోసియేట్‌గా మాత్రమే పనిచేస్తోందని సంస్థ స్పష్టం చేసింది. ఉద్యోగుల భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని టీ సీ ఎస్ తెలిపింది.









.avif&w=3840&q=75)





.png&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!