
క్రీడలు

పౌరసత్వ వివాదంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న ఆదేశాలపై కోర్టు శనివారం స్టే విధించింది. శుక్రవారం ఇదే లక్నో బెంచ్ రాహుల్‌పై విచారణకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, తాజాగా ఆ నిర్ణయాన్ని నిలిపివేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
నిందితుడి వాదనలు వినకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. నిందితుడికి ముందుగా నోటీసులు ఇచ్చి వివరణ కోరడం తప్పనిసరని స్పష్టం చేసింది. కర్ణాటకకు చెందిన ఒక కార్యకర్త రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉన్నారని ఆరోపిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేయగా, ఈ కేసు ప్రస్తుతం హైకోర్టులో కొనసాగుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!