
క్రీడలు

భారత అథ్లెటిక్స్ సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అథ్లెట్లందరికీ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించనుంది. వచ్చే నెల రాంచీలో జరగనున్న ఫెడరేషన్ కప్ పోటీల సమయంలో ఈ పరీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా ప్రతి అథ్లెట్‌కు సంబంధించిన జన్యు సమాచారాన్ని సేకరించి, దాన్ని భవిష్యత్ క్రీడా అభివృద్ధి కోసం వినియోగించనున్నారు.
సేకరించిన డేటాను పరిశోధన, గాయాల నివారణ, మరియు శాస్త్రీయ శిక్షణ విధానాల అభివృద్ధికి ఉపయోగించనున్నారు. ముఖ్యంగా మహిళా అథ్లెట్లకు ప్రత్యేకంగా ‘ఎస్‌ఆర్‌వై’ జన్యు పరీక్షలు నిర్వహించి, మహిళల విభాగంలో జీవశాస్త్రపరంగా మహిళలే పోటీ పడేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ నిర్ణయం క్రీడల్లో పారదర్శకత, న్యాయం పెంపొందించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.





.webp&w=3840&q=75)



.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!