

లెన్స్‌కార్ట్ తమ ఉద్యోగుల డ్రెస్ కోడ్‌పై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శల నేపథ్యంలో కొత్త స్టైల్ గైడ్‌ను విడుదల చేసింది. ఈ గైడ్‌లో భాగంగా బిందీ (బొట్టు), తిలకం, హిజాబ్, తలపాగా వంటి అన్ని సాంస్కృతిక గుర్తులను గౌరవిస్తూ స్వాగతిస్తున్నామని సంస్థ ప్రకటించింది. సంస్థ ప్రకటనలో, ఉద్యోగుల వ్యక్తిగత ఆచారాలు, సంప్రదాయాలను గౌరవించడం తమ విధానమని స్పష్టం చేసింది. బిందీ, తిలకం, మంగళసూత్రం, కడా, హిజాబ్, తలపాగా వంటి ప్రతీకలను ఎలాంటి సందేహం లేకుండా అనుమతిస్తున్నామని తెలిపింది.
ఇటీవల పాత స్టైల్ గైడ్‌పై వివాదం చెలరేగింది. అందులో హిజాబ్‌కు అనుమతి ఇచ్చినా, హిందూ సంప్రదాయాలకు సంబంధించిన బిందీ, తిలకం వంటి వాటిపై పరిమితులు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సంస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదంపై స్పందించిన సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో పీయూశ్ బన్సల్, అది పాత మార్గదర్శకమని, ప్రస్తుతం అన్ని సంప్రదాయాలకు గౌరవం ఇస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ ఈ అంశం కొంతకాలం చర్చనీయాంశంగా మారింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!