

భారత వైద్య పరిశోధనా రంగంలో కీలక మైలురాయి నమోదైంది. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఉన్న నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్‌ను, భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రీ క్లినికల్ రీసెర్చ్‌గా (ఎన్ఐపీసీఆర్) మార్చింది. ఈ కొత్త వ్యవస్థ 2026 మార్చి 20 నుంచి అధికారికంగా ప్రారంభమైంది.
ఈ సంస్థలో ఇప్పుడు ఆధునిక జంతు నమూనాలు, కణజాలాలు మరియు ఆర్గనాయిడ్స్ ఆధారంగా ప్రీ క్లినికల్ దశలో ఔషధ పరీక్షలు నిర్వహించనున్నారు. దీని ద్వారా ఔషధ అభివృద్ధి వేగవంతం కావడంతో పాటు విదేశీ ల్యాబ్‌లపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. ఇది భారతదేశంలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన తొలి పూర్తి స్థాయి ప్రీ క్లినికల్ పరిశోధనా కేంద్రంగా నిలిచింది.
ఓఈసీడీ జీఎల్పీ ప్రమాణాలతో పనిచేసే ఈ సంస్థలో జరిగే పరిశోధనలు అమెరికా ఎఫ్‌డీఏ, యూరోపియన్ ఈఎంఏ వంటి అంతర్జాతీయ సంస్థలచే ఆమోదించబడతాయి. దీని ద్వారా ఔషధ పరిశ్రమ, స్టార్టప్‌లు, విద్యా సంస్థలకు భారీ ప్రయోజనం కలగనుంది. హైదరాబాద్ గ్లోబల్ బయోమెడికల్ రీసెర్చ్ హబ్‌గా మరింత బలోపేతం కానుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!