.avif&w=3840&q=75)

మహిళా రిజర్వేషన్ల అమలు, డీలిమిటేషన్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్, ఇండియా కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ, ఇప్పటివరకు అమలు చేయకపోవడంపై ప్రశ్నించారు. 543 లోక్సభ స్థానాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంపై విస్తృత అంగీకారం ఉన్నప్పటికీ, కేంద్రం ఆలస్యం చేస్తోందని విమర్శించారు.
డీలిమిటేషన్ను 2027 జనగణన తర్వాతే నిర్వహించాలని, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య సమతుల్యత కాపాడే విధంగా పునర్విభజన జరగాలని అన్నారు. గతంలో అమలు చేసిన విధానాలను అనుసరించకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం డీలిమిటేషన్ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో దుష్ప్రచారం జరుగుతోందని, ప్రజలు అలాంటి ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.










.avif&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!