.avif&w=3840&q=75)

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైఖరిని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మహిళా బిల్లుపై తరచూ వైఖరి మార్చుకుంటున్నారని, రంగులు మార్చడంలో అభినవ ఊసరవెల్లిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. నారీ శక్తి పేరుతో డీలిమిటేషన్ బిల్లును తెచ్చి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల అమలులో కేంద్రం చిత్తశుద్ధి చూపడం లేదని, ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.
2023లోనే ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పటివరకు అమలు చేయకపోవడాన్ని ప్రశ్నించిన షర్మిల, మళ్లీ సవరణ బిల్లును తీసుకువచ్చి డీలిమిటేషన్‌తో లింక్ పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. 33 శాతం రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. డీలిమిటేషన్‌ను శాస్త్రీయంగా నిర్వహించి, కులగణన ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌కు సంబంధం లేకుండా వెంటనే అమలు చేయాలని కోరారు.










.avif&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!