
బిజినెస్

ఇటలీలో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బెర్గామో ప్రావిన్స్‌లోని కోవో పట్టణంలో శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. వైశాఖీ పండగ సందర్భంగా గురుద్వారాకు వెళ్లి బయటకు వస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపినట్లు సమాచారం.
ఈ ఘటనలో రాజిందర్ సింగ్, గుర్మీత్ సింగ్ (ఇద్దరూ 48 ఏళ్లు) మృతి చెందారు. కాల్పుల అనంతరం నిందితులు కారులో పారిపోయినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.










.avif&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!