

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, సెన్సిబుల్ డైరెక్టర్ వెంకటేశ్ మహాతో కలిసి రావు బహదూర్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్యతో మెప్పించిన ఈ కాంబినేషన్ ఈసారి ఒక పాత జమీందారీ నేపథ్యంతో సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కలిపిన ఆసక్తికర కథను తీసుకొస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు తన GMB ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేయడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
తాజాగా ‘ఓ సుందరి’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. రెహమాన్ రాసిన సాహిత్యానికి విజయ్ ఏసుదాస్ స్వరం అందించగా, స్మరణ్ సాయి సంగీతం సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు ఐదేళ్ల పాటు స్క్రిప్ట్‌పై పనిచేసిన వెంకటేశ్ మహా ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో రూపొందిస్తున్నారు. సాంగ్‌లో సత్యదేవ్ డిఫరెంట్ గెటప్స్ చూస్తుంటే ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందని అర్థమవుతోంది. ఈ చిత్రం సమ్మర్లో విడుదలకు సిద్ధమవుతోంది.








.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!