

లోక్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. విద్యారంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై గవర్నర్, ముఖ్యమంత్రితో చర్చించారు. ముఖ్యంగా విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరంపై గవర్నర్ దృష్టి సారించారు.
విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, వారికి ప్రమాణం చేయించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ సూచించారు. జూన్ 12న ఎల్బీ స్టేడియంలో తన ఆధ్వర్యంలో నిర్వహించనున్న అవగాహన కార్యక్రమంపై కూడా ముఖ్యమంత్రితో చర్చించారు. పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ల సమయంలోనే మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణపత్రం తీసుకోవాలని సూచించారు. గవర్నర్ సూచనలను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!