

యానిమేటెడ్ సినిమాల ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘మహావతార్’ సిరీస్ నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ‘మహా అవతార్: పరశురామ్’ పేరుతో రూపొందుతున్న రెండో చిత్రానికి టైటిల్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 2027 డిసెంబరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ధర్మం పతనమైనప్పుడు పరశురాముడు అవతరిస్తాడని, ఆయన ఒక పాలకుడు కాదు.. అధర్మాన్ని ఎదుర్కొనే శక్తిగా నిలుస్తాడని చిత్ర బృందం తెలిపింది.
దర్శకుడు అశ్విన్‌కుమార్ రూపొందించిన ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ మహావిష్ణువు దశావతారాల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో భాగంగా వచ్చిన తొలి చిత్రం ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ యూనివర్స్‌ను నిర్మిస్తుండగా, మొత్తం ఐదు సినిమాలు కూడా రాబోతున్నట్లు ప్రకటించారు.











.avif&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!