

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో భారీ విజయ తోరణాన్ని నిర్మించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను యూఎస్ కమిషన్ ఆన్ ఫైన్ ఆర్ట్స్ శుక్రవారం విడుదల చేసింది. అమెరికా స్వాతంత్య్రానికి 250 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నారు. ఈ తోరణం పై న్యూయార్క్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తరహాలో కాగడా మరియు కిరీటంతో కూడిన సుమారు 250 అడుగుల ఎత్తైన రెక్కల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
తోరణం ఇరువైపులా రెండు గద్దలు, నాలుగు సింహాల విగ్రహాలు ఉండగా, ఇవన్నీ బంగారు పూతతో అలంకరించనున్నారు. ఈ నిర్మాణం తూర్పు వైపున లింకన్ మెమోరియల్, పశ్చిమ వైపున ఆర్లింగ్టన్ జాతీయ శ్మశానవాటిక మధ్యలో ఉండనుంది.
ఈ భారీ నిర్మాణం పూర్తయితే, ప్రస్తుతం 99 అడుగుల ఎత్తు ఉన్న లింకన్ మెమోరియల్ కంటే ఇది ఎంతో ఎత్తుగా కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నిర్మాణాల్లో ఒకటిగా ఇది నిలుస్తుందని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. వాషింగ్టన్ డీసీకి ఇది ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!