

బాలీవుడ్లో పేట్రియాటిజం బ్యాక్‌డ్రాప్ సినిమాలు సక్సెస్ ఫార్ములాగా మారాయి. ‘ఛావా’, ‘ధురంధర్ 1, 2’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చాయి. దేశంపై శత్రుదేశాలు చేసే దాడులకు ప్రతిగా జరిగే యుద్ధ కథలు, ఆపరేషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ తరహా కథలు సిల్వర్ స్క్రీన్‌పై గూస్బంప్స్ తెప్పిస్తూ పెద్ద ఎత్తున ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కూడా దేశభక్తి నేపథ్యంతో సినిమా చేస్తూ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.
ఇప్పుడు ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో మరో సినిమా రూపొందుతోంది. పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత భారత సైన్యం చేపట్టిన ప్రతీకార చర్యల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. టీ సిరీస్ ఈ టైటిల్‌ను ఇప్పటికే రిజిస్టర్ చేయగా, ‘కాశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. లెఫ్టినెంట్ జనరల్ కేజెఎస్ థిల్లాన్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభించనుంది. టీ సిరీస్, ఐయామ్ బుద్ద ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మించనున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!