

రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కృషితో పిఠాపురం రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లోకి తీసుకువచ్చారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ₹37.25 కోట్ల వ్యయంతో స్టేషన్‌లో ఆధునిక సౌకర్యాలు, ప్లాట్‌ఫారమ్ అభివృద్ధి, షెల్టర్లు, ఆధునిక టాయిలెట్లు, డ్రైనేజ్ వ్యవస్థ, మరియు ప్రత్యేకంగా విభిన్న సామర్థ్యుల ప్రయాణికుల కోసం విశ్రాంతి గది వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనుంది.
గత పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ స్టేషన్ పరిసరాల్లో అశుభ్రత మరియు దుర్గంధం ఉన్నదని గమనించి అధికారులకు వెంటనే శుభ్రత ఏర్పరిచేలా సూచించారు. జనవరి నెలలో ఢిల్లీ లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో సమావేశంలో పవన్ కళ్యాణ్, పిఠాపురం ఆధ్యాత్మికంగా ముఖ్యమైన పట్టణం కావడం, దూర ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తారని, వారి సౌకర్యం కోసం అమృత్ భారత్ పథకం ద్వారా అభివృద్ధి చేయాలని ప్రత్యేకంగా అభ్యర్థించారు. పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ముఖ్యమంత్రి న. చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
.webp&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!