

చెన్నై లవ్ స్టోరీ సినిమా నుంచి విడుదలైన గురుతుందా పాట భారీ స్పందనతో దూసుకెళ్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే ఈ పాట 10 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంది. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న ఈ సినిమాను కలర్ ఫొటో, బేబి వంటి చిత్రాలను అందించిన నిర్మాతలు ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు.
మెలొడీ బ్రహ్మగా పేరుగాంచిన మణిశర్మ సంగీతం అందించగా, ఈ పాటలోని మెలోడీ మరియు భావోద్వేగం ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం, హరిచరణ్, శృతిక సముద్రాల గానం పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి.
పాటలోని హుక్ లైన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, యువతలో మంచి స్పందన తెచ్చుకుంది. మొదటి సింగిల్‌తోనే ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలుస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి.





.jpg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!