
ఆరోగ్యం

బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ఇప్పుడు సినీ ప్రపంచంతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారారు. ‘ధురంధర్’ సిరీస్ సినిమాలు కమర్షియల్ విజయాలు సాధించినప్పటికీ, వాటిలో రాజకీయ కోణం ఉందని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఆయన భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారనే చర్చలు మరింత ఊపందుకున్నాయి.
ఇటీవల అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలకు హాజరైన రణవీర్ సింగ్, అనంతరం నాగ్‌పూర్‌కు వెళ్లారు. అక్కడ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, కేశవ్ బాలిరామ్ హెడ్గేవార్ స్మృతి మందిరంలో నివాళులర్పించారు. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో భేటీ అయ్యారు. ఈ పరిణామంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెడతారా అనే ఊహాగానాలు మరింత పెరిగాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!