.jpg&w=3840&q=75)

సీనియర్ నాయకుడు హరీష్‌రావు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి కంటే నిర్మాణ సంస్థ అధినేతలా మాట్లాడారని ఆయన వ్యాఖ్యానించారు. సహచర మంత్రుల అవినీతిని కూడా పొంగులేటి అంగీకరించినట్టే ఉందని ఆరోపించారు.
రాఘవ నిర్మాణ సంస్థకు సంబంధించిన అక్రమాలను సభలోనే ఒప్పుకున్నారని హరీష్‌రావు చెప్పారు. నాలుగు శాఖలు ఇప్పటికే విచారణ జరిపి నివేదికలు ఇచ్చాయని, నోటీసులు ఇచ్చినా సంబంధం లేదని చెప్పడం అనుమానాలకు దారి తీస్తుందని అన్నారు. ఈ అక్రమాలపై ఇంకా వివరాలు బయటపెడతామని తెలిపారు.
పొంగులేటి తన ప్రవర్తన మార్చుకోవాలని హరీష్‌రావు హెచ్చరించారు. కొన్ని సంస్థల్లో పొంగులేటి కుమారుడికి వాటా ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణపై కూడా సందేహాలు వ్యక్తం చేస్తూ, అవి ప్రభుత్వ భూములైతే భద్రత కోసం వ్యక్తులను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. నాదర్‌గుల్ భూములను 2016లోనే నిషేధించిన విషయాన్ని గుర్తు చేశారు.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!