

ప్రతిష్టాత్మక తమిళ–తెలుగు ద్విభాషా చిత్రం గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైసర్‌ను సంచలన దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. రఫ్ నోట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రీ రిలీజ్ దశలో మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. తాజాగా విడుదలైన ట్రైసర్‌లో యాక్షన్, భావోద్వేగాల మేళవింపు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ, తమ ట్రైసర్‌ను విడుదల చేసి ప్రోత్సాహం అందించిన హరీష్ శంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవిక కథతో పాటు వాణిజ్య అంశాలను కలిపి ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించనున్నామని చెప్పారు. ఈ చిత్రంలో ఆరి అరుజునన్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనుండగా, రాజ్ తరుణ్ ఈ చిత్రంతో తమిళ చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. భరత్ కీలక భావోద్వేగ పాత్రలో నటిస్తున్నారు. అలాగే అమూ అభిరామి, కిశోర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక ప్రత్యేక ఆకర్షణగా స్వతంత్ర సంగీత కళాకారుడు వేధన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. వివిధ ప్రదేశాల్లో విస్తృతంగా చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. యాక్షన్ భావోద్వేగం, సామాజిక అంశాల మేళవింపుతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా సిద్ధమవుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!