

మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఫోటో జర్నలిజాన్ని ప్రజాస్వామ్యానికి కళ్ళుగా అభివర్ణించారు. వార్తలను రాయడానికి కలం ఉపయోగిస్తే, నిజాన్ని చూపించడానికి కెమెరా ఉపయోగిస్తారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 23 వ ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డుల 2025 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థి రాజకీయాల కాలం నుంచే ఫోటో జర్నలిస్టులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఫోటోగ్రఫీకి భాషలతో సంబంధం ఉండదని, ఒకే ఫోటో వందల పదాలు చెప్పలేని భావాన్ని వ్యక్తం చేస్తుందని తెలిపారు. కె. శ్రీనివాస రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దేవులపల్లి అమర్ తదితరులు కూడా మాట్లాడి ఆధునిక సాంకేతిక మార్పులకు అనుగుణంగా ముందుకు సాగాలని, దృశ్య వార్తల్లో సహజత్వాన్ని కాపాడాలని సూచించారు.






.webp&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!